ప్రధానంగా శ్రీ రామ సాగర్ నుండి. ధవళేశ్వరం వరకు మాత్రమే తరచూ సర్వేలు జరిగాయి . గోదావరిలో వరద ఉండాలంటే మూడు సబ్ బేసిన్ లే గతి. ప్రాణహిత ఇంద్రావతి నదులు తెలంగాణ ప్రాంతంలో కలిస్తే శబరి ఆంధ్ర ప్రదేశ్ లో గోదావరిలో కలుస్తుంది. ఈ మూడు సబ్ బేసిన్ ల్లో ప్రవాహం ఉంటేనే గోదావరిలో నీళ్లు ఉంటాయి . ఒక్కో దఫా గణాంకాలు లెక్కించినపుడు ఆయా రాష్ట్రాల్లో నిర్మింపబడిన ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలోనూ ప్రతి పాదనలోనూ ఉన్న పథకాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని మిగులు జలాలను అంచనా వేస్తున్నారు. తిరిగి మరి కొంత కాలానికి నీటి లభ్యత వినియోగం లెక్కించితే మిగులు తగ్గి పోతున్నది. ఎప్పటికప్పటికి అన్ని రాష్ట్రాల్లో నీటి వినియోగం పెరిగి పోతున్నది.
గోదావరి నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి? బేసిన్ లోని రాష్ట్రాలు వినియోగించుకోగా మిగులు నీరు ఎంత ఉంటుంది ? ఇవి ఇప్పటి వరకు యక్ష ప్రశ్నలుగానే ఉన్నాయి. ఒక దానికొకదానికి సంబంధం లేకుండా గణాంకాలు పలు రకాలుగా చెబుతున్నాయి . అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రతిపాదించిన తర్వాత కేంద్ర జల సంఘం సంధించిన ప్రశ్నావళికి ఇచ్చే సమాధానాలతో అసలు సిసలు గణాంకాలు తేలిపోనున్నాయి. వరద, మిగులు జలాలకు నిర్వచనం వెలుగు చూడ బోతున్నది. ఒక విధంగా ఇది శుభ పరిణామమే! గోదావరి నదీ జలాల గురించి ఎంతో కొంత సమాచారం అవగాహన ఉన్న వాస్కోప్ సంస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తయారు చేస్తున్నందున సాధ్యమైనంత వరకు సరైన గణాంకాలు వెలుగు చూడవచ్చు.అప్పటికీ తేలకపోతే పోలవరం బనకచర్ల అనుసంధానం ఆమోదం పొందినా పొందక పోయినా ఈ సందర్భంలో కేంద్ర జల సంఘమైనా తేల్చే అవకాశం ఉండవచ్చు . ఇంత కాలం ఏడుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు కథ చందంగా ఉన్న ఈ గణాంకాలకు స్పష్టత ఏర్పడుతుంది. కాగా గోదావరిలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వాటాలు మాత్రం యక్ష ప్రశ్నగానే మిగిలిపోనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ట్రిబ్యునల్ కేటాయించిన 1486 టిఎంసిల్లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వాటాలు కూడా అధికారికంగా తేల లేదు. 945 టిఎంసిలు తమ వాటా అని ఆంధ్ర ప్రదేశ్ వాటా 518 టిఎంసిలని తెలంగాణా చెబుతోంది. ఆంధ్ర ప్రదేశ్ తత్భిన్నంగా తమ వాటా 737 టిఎంసిలని మిగిలినది తెలంగాణదని చెబుతోంది. కొసమెరుపు ఏమంటే ఈ గణాంకాలు కూడా ఎప్పటికప్పుడు మారి పోతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ కొత్త ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత కూడా కేంద్ర జల సంఘానికి ఎవరి వాటా ఎంతో తేల్చే అధికారం లేదు. 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం వచ్చిన తర్వాత ట్రిబ్యునల్స్ కు తప్ప నదీ జలాల వాటాలు నిర్ణయించే అధికారం ఎవ్వరికీ లేదు. ఎందుకో గాని కొత్త ట్రిబ్యునల్ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్టుబట్టడం లేదు. సూత్ర ప్రాయంగా తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం పోలవరం బనకచర్ల అనుసంధానం పథకం భవిష్యత్తు తేలిన తరువాత కూడా కొనసాగే అవకాశం ఉంది.ప్రధానంగా శ్రీ రామ సాగర్ నుండి. ధవళేశ్వరం వరకు మాత్రమే తరచూ సర్వేలు జరిగాయి . గోదావరిలో వరద ఉండాలంటే మూడు సబ్ బేసిన్ లే గతి. ప్రాణహిత ఇంద్రావతి నదులు తెలంగాణ ప్రాంతంలో కలిస్తే శబరి ఆంధ్ర ప్రదేశ్ లో గోదావరిలో కలుస్తుంది. ఈ మూడు సబ్ బేసిన్ ల్లో ప్రవాహం ఉంటేనే గోదావరిలో నీళ్లు ఉంటాయి . ఒక్కో దఫా గణాంకాలు లెక్కించినపుడు ఆయా రాష్ట్రాల్లో నిర్మింపబడిన ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలోనూ ప్రతి పాదనలోనూ ఉన్న పథకాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని మిగులు జలాలను అంచనా వేస్తున్నారు. తిరిగి మరి కొంత కాలానికి నీటి లభ్యత వినియోగం లెక్కించితే మిగులు తగ్గి పోతున్నది. ఎప్పటికప్పటికి అన్ని రాష్ట్రాల్లో నీటి వినియోగం పెరిగి పోతున్నది.

అయితే ఈ గణాంకాలు చాల రోజుల క్రితం సమాచారం ఆధారంగా రూపొందించబడిందని భావింపబడి మరల తిరిగి అంచనాలు తయారు చేశారు. 1901-02 నుండి 2010-11 వరకు అంటే 110 సంవత్సరాల సమాచారం ఆధారంగా లెక్కలు వేస్తే శ్రీ రాం సాగర్ దిగువున 75 శాతం నీటి లభ్యత కింద 2106.59 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు తేలింది. అంటే 1989 అంచనాకు ఇప్పటికీ ఇచ్చంపల్లి వద్ద 231 టిఎంసిలు తగ్గి పోయాయి. పైగా రెండవ విడత చేసిన సర్వేలో రెండు రాష్ట్రాల అవసరాలు పెరిగాయి. సాధ్యమైనంత వరకు ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఇటీవలగా కేంద్ర ప్రభుత్వం గోదావరి కావేరి నదుల అనుసంధానం ప్రముఖంగా తెర మీదకు తెచ్చినపుడు కేంద్ర జల సంఘం గోదావరిలో మిగులు నీళ్లు లేనేలేవని తేల్చి చెప్పడం గమనార్హం. . తత్ఫలితంగానే ఛత్తీస్ ఘడ్ వాడుకోని నికర జలాల కోసం చాలా కాలంగా జాతీయ జల అభివృద్ధి సంస్థతో పాటు నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ వెంపర్లాడుతోంది. ఛత్తీస్ ఘడ్ లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఉన్నా తమ వాటా ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు.





