సరస్వతీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

– బాసర, వర్గల్‌లో జోరుగా అక్షరాభ్యాసాలు
– ప్రత్యేక పూజలు చేపట్టిన భక్తులు

నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 23: దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతి దేవికి అంకితం చేయబడింది. జ్ఞానం, విద్య, కళలలో విజయం కోరుతూ ప్రజలు సరస్వతి దేవిని పూజిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి చాలా ముఖ్యమైనది. మారుతున్న ఋతువుల ప్రారంభం, వసంతకాలం ఆగమనాన్ని సూచిస్తుంది. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని భక్తగా పూజించడం వల్ల చదువుపై దృష్టి పెట్టడానికి, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. దీంతో పలు ఆలయాల్లో ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని బాసర,వర్గల్‌, ఓయూ క్యాంపస్‌ ‌తదితర సరస్వతీ ఆలయాల్లో విద్యార్థుల సందడి కనిపించింది. అక్షరాభ్యాసాలకు చిన్నారులు తరలివచ్చారు. నిర్మల్‌ ‌జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాసర పుణ్యక్షేత్రం. భక్తుల తో కిక్కిరిసిపోయింది. వసంత పంచమి సందర్భంగా అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునుంచే ప్రత్యేక అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు మొదలయ్యాయి. వేకువ జామునుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్థరాత్రి నుంచి చదువుల తల్లి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. చిన్నారుల అక్షర శ్రీకార పూజలు.. గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు కొనసాగాయి. వసంత పంచమిని పిల్లలకు పాఠశాల విద్య ప్రారంభించడానికి శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున చిన్న పిల్లలకు మొదటిసారి రాయడం నేర్పించడం లేదా విద్యకు సంబంధించిన ఏదైనా కొత్త అడుగు వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున పేద పిల్లలకు పుస్తకాలు, నోట్‌బుక్‌లు లేదా పెన్నులు దానం చేయడం కూడా పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు సాగాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *