ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

– జెరియాట్రిక్ సేవలు విస్తరించాలి

– అనారోగ్యంతో వున్న వృద్ధుల జాబితా సిద్ధం చేసుకోండి
– మంత్రి దామోదర రాజనరసింహ
– డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్లతో సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపా రు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లో జెరి యాట్రిక్ సేవలు అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఈమేరకు జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి బుధవారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తోూ, డీఎంఈ నరేంద్ర కుమా ర్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. జీవన ప్రమాణాలు పెరిగాయని, దీంతో వృ ద్ధుల సం ఖ్య కూడా పెరుగుతున్నదన్నారు. పిల్లల కోసం మనం ప్రత్యేకంగా చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టుగానే, జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం భవిష్యత్తులో మన దేశంలోనూ ఏర్పడు తుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీ రక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరిం చాలని మంత్రి సూచించారు. ప్రతి జీజీహెచ్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇప్పటికే జెరియాట్రిక్ వార్డులు ఏ ర్పాటు చేశామన్న విషయా న్ని ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. అనారోగ్య సమస్య లతో బాధపడుతున్న వృద్ధుల జాబితాలు సిద్ధం చేసుకుని, వారికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డీఎంహెచ్విలదేన ని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం తరహాలో హాస్పిటల్, మెడికల్ కాలేజీ పేరిట అరకొర బిల్డింగు లు కట్టి వదిలేయడం లేదు. ప్రతి హాస్పిటల్లోనూ అవసరమైనమేర డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని నియమిస్తున్నామ న్నారు. ఈ రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం.. మరో 7 వేలకుపైగా పోస్టులు భర్తీ అవుతు న్నాయి. మ్యాన్ పవర్ తో పాటు మీరు అడిగిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇక మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకు సర్వీ స్ చేయడం మీ చేతుల్లోని ఉంది. ప్రభుత్వ హాస్పి టళ్లు మీవి మీరు వాటిని ఓన్ చేసుకుని కాపాడు కోవాలి. అక్కడికి వచ్చే పేషెంట్లకు మంచి సర్వీస్ అందించి రక్షించుకోవాలి. డీఎంహె చ్్వలు, హాస్పి టల్ సూపరింటెండెంట్ల అటెండెన్స్ను మేము మానిటర్ చేస్తున్నామన్నారు. మీ సిబ్బంది అటెండె నన్ను మీరు మానిటర్ చేస్తున్నారో లేదో కూడా చేస్తున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఎంతటివారిపైన అయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగు ణంగా వైద్య వ్యవస్థ కూడా మారాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page