గిగ్‌ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక చట్టం

– కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురాబోతున్నామని, ఈనెల 12న జరగబోయే కేబినెట్‌ సమావేశంలో దానికి ఆమోదం తెలపనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. సచివాలయంలో తనను గురువారం కలిసిన గిగ్‌వర్కర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం రాహుల్‌ గాంధీ ఆలోచనల్లో భాగంగా తీసుకొస్తున్నామని, కేబినెట్‌ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. గిగ్‌ వర్కర్లకు కొత్త చట్టం ద్వారా భద్రత, హక్కులు, సామాజిక రక్షణ కల్పించబోతున్నామన్నారు. కొత్త చట్టం ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి మార్పులు లేదా చేర్పులు అవసరమో కూడా ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. గిగ్‌ వర్కర్ల భవిష్యత్తును భదర్రగా ఉంచడంతోపాటు వారికి స్థిరమైన హక్కులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *