– సంత్ సేవాలాల్ చూపిన మార్గాన్ని అనుసరించాలి
– మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ గుడి హరిత హోటల్ పక్కన ప్రభుత్వం సద్గురుసంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ బిక్షపతి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం హర్షణీయమని అన్నారు. బంజారా కులస్తులు భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించామన్నారు. సమావేశానికి ముందు సీతక్క బంజారా భాషలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. చదువుతోనే ఏ జాతైనా బాగుపడుతుందని, చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలని, అభివృద్ధి చెందిన వారు మిగతా వారి ఉన్నతికి పాటుపడాలని కోరారు. ముందుగా ములుగు బంజారాల కుల పెద్ద పోరిక గోవింద్ నాయక్ మాట్లాడుతూ బంజారాలకు మద్దిమడుగులో 20 ఎకరాల స్థలంలో గుడి నిర్మాణం కోసం కేటాయించినందుకు, ములుగు జిల్లా గట్టమ్మ వద్ద సుమారు 20 గుంటల స్థలం, ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చిందుకు ముఖ్యమంత్రి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు పోరిక గోవింద్ నాయక్, పూజారులు రమేష్ గిరి మహారాజ్, కిషన్ మహారాజ్, ఐటిడిఏ అధికారి జనార్ధన్, రాహుల్, బంజారా కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





