– వారిపై మతపరమైన ఒత్తిళ్లు ఉండరాదు
– ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: నాసిక్‌లో ఇటీవల జరిగిన ‘తలవ్ జిహాద’ ఆరోపణల కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఓ ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై మతపరమైన ఒత్తిళ్లు, వేధింపులు, రహస్య నెట్‌వర్క్‌ల ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో లక్షలాదిమంది ఐటీ ఉద్యోగులు ఉన్నందున వారి పని వాతావరణం కెరీర్ అభివృద్ధికి మాత్రమే పరిమితం కావాలన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ కొన్ని కీలక సూచనలు చేశారు. అన్ని ప్రధాన ఐటీ కంపెనీల హెచఆర్ బృందాలతో తక్షణ సమావేశం నిర్వహించాలని, ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన విధానాలు రూపొందించాలని సూచించారు. ఉద్యోగుల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ కేసును కూడా దాచిపెట్టకూడదని అన్నారు. ఉద్యోగులు కార్యాలయాల్లో స్వేచ్ఛగా, భద్రతతో పనిచేసే వాతావరణం ఉండాలని బండి సంజయ్ సూచించారు. ఏ రకమైన ఒత్తిడి, వేధింపులు, దోపిడీకి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అలాగే, బాధితులు ఒంటరిగా ఉండకుండా వారికి తగిన రక్షణ, మద్దతు అందించాలని సూచించారు. పలువురు ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాల్లో జరిగిన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారన్నారు. ఈ హెచ్చరిక సంకేతాలను ప్రభుత్వం, కంపెనీలు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఐటీ కంపెనీల యాజమాన్యాలు, హెచఆర్ విభాగాలు ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రతీ ఫిర్యాదును నిష్పక్షపాతంగా, వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. నాసిక్ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగ భద్రతపై చర్చను మరింత పెంచాయని తెలిపారు. ఉద్యోగుల రక్షణ, కార్యాలయాల్లో పారదర్శకత, ఫిర్యాదు వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయని ఆయన అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





