– ఈనెల 16 నుంచే ప్రత్యేక సర్వీసులు
హనుమకొండ,ప్రజాతంత్ర,నవంబర్14: తెలంగాణ కుంభమేలాగా ప్రసిద్ధిచెందిన మేడారం జాతరకు భక్తులందరూ సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులను సమర్పించుకునేందుకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ నుంచి స్పెషల్ బస్సులను నడిపిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా వరంగల్ రీజియన్ భక్తుల సౌకర్యార్థం హనుమకొండ నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులు ఈనెల 16ఆదివారం నుంచి నడపడం జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి భక్తుల రద్దీకనుగుణంగా మేడారంకు బస్సులు నడపబడుతుందని, మేడారం ప్రత్యేక బస్సుల ఆపరేషన్ నిర్వహణకు హనుమకొండ బస్ట్సేషన్‌లో ఆర్టీసీ అధికారులు 24 గంటలు ప్రయాణికుల సేవలకు అందుబాటులో ఉంటారని, అన్ని ఎక్స్‌ప్రెస్, ప్లలెవెలుగు బస్సులలో మహిళలకు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. ఉచిత ప్రయాణానికి అనుమతించబడుతుందని కావున మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సురక్షితంగా వారి మొక్కలను తీర్చుకోగలరని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





