స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ది ధృతరాష్ట్ర పాత్ర

– మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొందపెట్టాలి
– బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు చేవెళ్ల నేతలు
– మాజీ మంత్రి ‌కేటీఆర్‌ ‌పిలుపు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ధృతరాష్ట్రపాత్ర పోషిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు.  మహాభారతంలో ధృతరాష్టుడ్రికి ఏమీ కనిపించనట్లు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సభాపతి అలానే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌సమక్షంలో చేవెళ్ల నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌లో సోమవారం చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూపేదలకు న్యాయం జరగాలంటే పార్టీ అధినేత కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈసారి కేసీఆర్‌ ‌సీఎం అయితే మిగిలిన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చేవెళ్లలో కాలె యాదయ్యను తన మనిషి అనుకుని కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. కానీ కొన్ని రోజులకే ఆయన కాంగ్రెస్‌ ‌గూటికి వెళ్లాడంటూ మండిపడ్డారు. యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, ఆయనపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరామన్నారు. కానీ యాదయ్య బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అని స్పీకర్‌ అం‌టున్నారని పేర్కొన్నారు. స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌, ‌యాదయ్యలు చిన్ననాటి నుంచీ దోస్తులని, వీరిద్దరూ ఒకే బండిపై తిరిగేవారని కేటీఆర్‌ ‌తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో చేవెళ్లలో దళితులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చాలా హామీలు ఇచ్చారన్నారు. ‌ప్రతీ దళిత కుటుంబానికి రూ.12 లక్షలు కాదు కదా కనీసం 12 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. వృద్ధులకు పింఛన్లు పెంచుతామని చెప్పి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌హామీలపై నిలదీస్తుంటే తమపై కేసులు పెట్టి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

గణతంత్ర దినోత్సవాన స్పీకర్‌పై విమర్శలా : ఎమ్మెల్సీ అద్దంకి

గ‌ణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్‌ను అవమానించినందుకు కేటీఆర్‌ ‌బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ’సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటి? సభ్యుడిగా మీకు సంస్కారముందా? ముఖ్యమంత్రిని అవమానించడం మీది ఏ రాజనీతి?  నాయన కేసీఆర్‌ ‌రాజ్యాంగంతో తెలంగాణ వచ్చిందని చెబుతూ అవమానిస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేకులుగా మారి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడిస్తున్నారు’ అని ఎమ్మెల్సీ విమర్శించారు. ‘మీరు పదిమంది గురించి మాట్లాడుతున్నారు.. కానీ 39 మందిని పార్టీలో చేర్చుకున్న మిమ్మల్ని ఏమనాలి?  మీరు చేసిన రాజ్యాంగ ద్రోహాన్ని ప్రజలు మననం చేసుకుంటున్నారు. ఫ్రస్టేషన్‌తో చేస్తున్న నాటకాలను ప్రజలు తిరస్కరించారు. మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉండటం దురదృష్టకరం. ఇప్పటికైనా మీరు చేసిన తప్పును గమనించి క్షమాపణ చెబితే మంచిది అని అద్దంకి హిత‌వు ప‌లికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *