న్యూదిల్లీ, నవంబర్ 13: తెలంగాణ రాజకీయాల్లో మరోమారు ఉత్కంఠ మొదలయ్యింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణలో స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్దారని బిఆర్ఎస్ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. అయితే అంతకుముందే ఎమ్మెల్యేల ఫిరాయిం పు విచారణపై స్పీకర్ సుప్రీంను గడువు కోరు తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుతోపాటు అన్నింటిపై సోమవారం విచారణ జరు పుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు రా ష్ట్ర రాజకీయ భవిష్యత్తును, శాసనసభ ప్రతిష్టను ప్రభావితం చేయనుంది అనడంలో సందేహం లేదు. గతంలో ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావన కూడా ఉండడం, ఈ విచారణకు మరింత ప్రాధాన్య తను తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తుది తీర్పు ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలకు, ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు ఒక కఠినమైన హెచ్చరికగా మారుతుందో లేదో వేచి చూడాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





