ఉమ్మడి ఏపీలో కూడా ఇలా జరగలేదు

– స్పీకర్‌ ‌తీరు బాధాకరం : గంగుల కమలాకర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ‌తెలిపారు. కిరణ్‌కుమార్‌ ‌రెడ్డి అప్పట్లో స్పీకర్‌గా ఉండే అని.. ఆ తర్వాత మనోహర్‌ అయ్యారని.. అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమానాలు జరగలేదని పేర్కొన్నారు. ఇక్కడ సభ్యులు అందరికీ సమాన హక్కులు ఉంటాయని అప్పటి స్పీకర్‌ ‌మనోహర్‌ ‌తమకు సమయం ఇచ్చేదని గుర్తుచేశారు. కానీ నిన్న అసెంబ్లీలో స్పీకర్‌ ‌తీరు బాధాకరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాలిపోయిన మోటార్లు, ఎండిపోయిన పంటలను అసెంబ్లీకి తీసుకెళ్లామ‌ని గుర్తుచేశారు. పక్షపాత వైఖరితో ఉండకండి అని, వ్యవహర శైలిని మార్చుకోవాలని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌కు సూచించారు. ముఖ్యమంత్రికి ఎలాంటి హక్కు ఉంటుందో అదే అందరు సభ్యులకు ఉంటుందని తెలిపారు. మా హక్కుల కోసమే మాట్లాడామని చెప్పారు. నిన్న అసెంబ్లీలో గిల్లికజ్జాలు పెట్టుకోవాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి చూశాడని గంగుల అన్నారు. మమ్మల్ని తిట్టేందుకే సభకు వచ్చాడని, కడుపునిండా తిట్టి వెళ్లాడని విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి రెండు గంటలు మాట్లాడతాడా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎజెండా కూడా పొద్దున రెండు గంటలకు ఇస్తారా అని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంపై మాట్లాడటానికి నేను, జగదీశ్‌ ‌రెడ్డి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్‌ ఇవ్వమని చెప్పడమేంటని స్పీకర్‌పై గంగుల మండిపడ్డారు. ముఖ్యమంత్రికి మేం భజన చేయాలా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో అసెంబ్లీ హుందాగా నడిచిందని, గత స్పీకర్‌ ‌ప్రతిపక్షాలకు తగినంత సమయం ఇచ్చేవారని గుర్తుచేశారు. ప్రస్తుత స్పీకర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌సభ్యుల గొంత నొక్కేందుకు పనిచేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా, రేవంత్‌ ‌ప్యాలెస్‌లా నడిపిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌కి భజన చేసేందుకు అసెంబ్లీకి వెళ్లాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌, ‌సీఎం సభ సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *