సోయా కొనుగోళ్లపై ఆందోళన

– బీఆర్‌ఎస్‌ ‌పిలుపుతో జిల్లా బంద్‌
-‌ స్వ‌చ్ఛందంగా వాణిజ్య సంస్థల మద్దతు
– మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అరెస్ట్

ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లు చేపట్టాలని ఆదిలాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో మంగళవారం బంద్‌కు బీఆర్‌ఎస్‌ ‌పిలుపునిచ్చింది. దీంతో పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ ‌పాటించాయి. పట్టణంలో బైక్‌ ‌ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సోయా కొనుగోలులో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు, సరైన రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో డిపో వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రామన్న సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కొంతకాలంగా సోయా రైతులు పడుతున్న ఇబ్బందులపై రామన్న పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా సోయా కొనుగోలులో గిట్టుబాటు ధరలపై సరైన ఆధారిత విధానాలు లేకపోవడంపై పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంద్‌కి పిలుపునిచ్చారు. బస్సుల రాకపోకలను నేతలు అడ్డుకున్నారు.
ఆర్టీసీ డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ ‌నేతలు మీడియాతో మాట్లాడారు. అన్నదాతలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించడంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రైతన్నల సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలపై తాము పోరాడుతుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులు సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు న్యాయం చేసేవరకు తాము పోరాడతామని బీఆర్‌ఎస్‌ ‌నేతలు స్పష్టం చేశారు. నాయ‌కుల అరెస్టుల‌తో ‌జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, గులాబీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు ఎందుకు అరెస్ట్ ‌చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *