– గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి వసతి సౌకర్యం ఆఫర్
ముంబై, మార్చి 5: కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రజలను ముఖ్యంగా వలస కార్మికులకు అండగా నిలిచారు. ఎంతోమందికి ఉపాధి చూపించారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల ద్వారా తమ ఇళ్లకు చేర్చారు. ఇలా ఆపదలో ఉన్న వారికి ’నేనున్నా’ అంటూ అండగా నిలుస్తూ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్ప్పుడు యుద్థ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆయన సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉచితంగా వసతి కల్పిస్తామని ప్రకటన చేశారు. ఏ దేశస్థులైనా సరే, ఎలాంటి షరతులు లేకుండా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు సోషల్ విÖడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘కష్ట సమయంలో మనసున్న మనిషిగా ముందుకు రావడం ఎంతో అవసరం. సహాయం అవసరమైనవారు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరాలతో మెసేజ్ చేయండి. మా టీమ్ తక్షణమే స్పందిస్తుంది’ అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. తనను సంప్రదిస్తే వారికి అక్కడే ఉచిత వసతిని సమకూరుస్తానని ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





