– గంగారాం ఆస్పత్రి వైద్యుల వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 26: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24వ తేదీ రాత్రి జ్వరం కారణంగా ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోనియా ఆరోగ్యానికి సంబంధించి గంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ విజయ్ స్వరూప్ గురువారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. చికిత్సకు సోనియా ఆరోగ్యం సహకరిస్తోందని వెల్లడించారు. ఆమెకు సీనియర్ డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోందని, ఇంకా పర్యవేక్షణ అవసరం ఉందని తెలిపారు. కాగా, డాక్టర్లు సిస్టమేటిక్ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి సోనియాకు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరికొన్ని రోజులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




