ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ‌

– సోనియాగాంధీ ఆకాంక్ష‌
– గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హ‌ణ‌పై హ‌ర్షం
– మూడంచెల వ్యూహంతో ముందుకెళుతున్న రాష్ట్రం
– రేవంత్‌ను అభినందించిన  కాంగ్రెస్ అధినేత్రి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కీల‌క భూమిక పోషిస్తుందని  కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హించ‌నుండ‌డంపై ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్నం దుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ  అభినంద‌న‌లు తెలిపారు.  రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప‌లు కీల‌క‌, ప్రాముఖ్య‌మైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగ‌స్వాములు కాద‌ల్చిన‌ వారికి ఈ స‌మ్మిట్ ఒక వేదిక‌గా అందిస్తుంద‌ని ఆమె తెలిపారు. అర్బన్, సెమీ అర్బన్,  గ్రామీణ‌-వ్య‌వ‌సాయాభివృద్ధి ప్రాజెక్టుల‌కు స‌మ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోంద‌ని సోనియా గాంధీ ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్ర‌తిభ‌, సాంకేతిక నైపుణ్యాల అభివృద్దికి స‌మ్మిట్ మ‌రింత తోడ్ప‌డుతుంద‌ని ఆమె తెలిపారు.   సమ్మిట్‌లో పాల్గొనే వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *