హాస్పిటల్‌లో చేరిన సోనియా గాంధీ

– శ్వాసకోస సంబంధ సమస్యలతో ..

న్యూదిల్లీ, జనవరి 6: కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌లో చేర్పించారు. సోనియాగాంధీ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. హాస్పిటల్‌ ‌వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా గాంధీకి సీనియర్‌ ‌పల్మనాలజిస్ట్ ‌పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం కారణంగానే సోనియా గాంధీకి ఈ అనారోగ్యం ఏర్పడినట్లు హాస్పిటల్‌ ‌వర్గాలు వెల్లడించాయి. కాలుష్య స్థాయిలు పెరగడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు సోనియాగాంధీకి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా వైద్యులు గమనిస్తున్నట్లు సమాచారం. కాగా గతంలోనూ సోనియాగాంధీ పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *