హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్ తన బృందంతో కలిసి రచించి, పాడి, వీడియోగా చిత్రీకరించిన సమ్మక్క సారక్క పాట సీడీనీ ప్రజా భవన్‌లో మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ పాటలో మంత్రి సీతక్క కూడా తన గానం కలిపి సమ్మక్క సారక్కలపై ఉన్న భావోద్వేగాన్ని పంచుకున్నారు. సమ్మక్క సారక్క జాతర కోసం గడ్డం సంతోష్ బృందం పాడిన పాటను రాష్ట్ర ప్రజలందరూ ఆదరించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేస్తూ కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గడ్డం సంతోష్‌బృందం కళాకారులు, తదితరులు పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




