సొనాటైప్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం

– మరో అగ్రశ్రేణి టెక్‌ కంపెనీ జీసీసీ స్థాపనకు హైదరాబాద్‌ ఎంపిక‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సప్లై చైన్‌ సెక్యూరిటీ కంపెనీ సొనాటైప్‌ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ను ప్రారంభించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌ హాజరయ్యారు. అమెరికా వెలుపల సొనాటైప్‌ సంస్థ స్థాపించిన ఇది మొదటి రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కూడా. హైటెక్‌ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 200కుపైగా దీప్‌టెక్‌ ఇంజనీర్లు, ప్రోడక్ట్‌ లీడర్లు, కృత్రిమ మేధస్సు నిపుణులు పనిచేస్తారు. వీరు సురక్షిత సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌, ఏఐ ఆధారిత సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణలకు తోడ్పడనున్నారు. సొనాటైప్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్‌ కంపెనీలలో 70% సంస్థలకు సేవలు అందిస్తోంది. 15 మిలియన్లకు పైగా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కమ్యూనిటీకి ఇది మద్దతు ఇస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ హైదరాబాద్‌లో తమ జీసీసీ ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో సొనాటైప్‌ చేరడం తమకు ఆనందంగా ఉందన్నారు. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఆవిష్కరణలకు హైదరాబాద్‌ నుంచి వారు చేస్తున్న కృషి విలువైనదిగా నిలుస్తుంది అని అన్నారు. హైదరాబాద్‌ 2024లో 70శాతం జీసీసీలను ఆకర్షించిందని, ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని 50శాతం జీసీసీలు నగరంలో ఏర్పడతాయని, దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న కొత్త జీసీసీలలో 30%-35% హైదరాబాద్‌లోనే వస్తాయని అంచనా. ఐఏ, లాట్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యమైన మానవ వనరులు, సదుపాయాలు, రియల్‌ ఎస్టేట్‌, ఆవిష్కరణ వాతావరణం ఇవన్నీ హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్న కీలక అంశాలుగా మారాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా పలు ప్రధాన జీసీసీలు ఏర్పాటయ్యాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page