తండ్రీకూతుళ్లను హత్య చేసిన అల్లుడు

– ఆపై పెట్రోల్‌ ‌పోసి తగులబెట్టాడు

హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 18:హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్‌ ‌గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మృతులను రాజశేఖర్‌ (54), ‌రాజశ్రీ (24)గా గుర్తించారు. కాగా, రాజశ్రీకి 2023లో ప్రవీణ్‌ అనే యువకుడితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు కూడా ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా ప్రవీణ్‌.. ‌వారిద్దరి ఒంటిపై డీజిల్‌ ‌పోసి నిప్పు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇక ప్రవీణ్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ప్రవీణ్‌ ఈ ‌నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *