చర్చల ద్వారా సమస్యల పరిష్కారం

– ప్రజలను చంపేవారు దేశ భక్తులు ఎలా అవుతారు
– సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టులు
– నక్సల్స్ పై హోం మంత్రి అమిత్ షా

న్యూదిల్లీ, మార్చి 30: చర్చల ద్వా రానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలను చంపేవారు దేశ భక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నక్సలైట్లు తమ సిద్ధాంతాన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని తెలిపారు. నక్సలైట్లకు ఆదర్శం భారతీయులెవరూ కాదు.. వారికి మావో ఆదర్శమని అమిత్ షా పేర్కొన్నారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటారు కానీ హింసను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. కాంబోడియా, పెరూ, కొలంబియాలో భయంకర రక్తపాతం జరిగిందని పేర్కొన్నారు. దేశాభి వృద్ధికి మావోయిస్టు సిద్ధాంతాలు, విధానాలు తీవ్ర ఆటంకం అన్నారు. మావోయిస్టుల రక్తపాత సిద్ధాంతాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. బస్తర్లో నక్సల్స్ అనేక ఏళ్లపాటు సమాంతర ప్రభుత్వం నడిపారు. ఆయుధాలు వీడాలని బస్తర్ వెళ్లి పలుసార్లు కోరాం అని అన్నారు. నక్సలిజం నశించాలని గిరిజనులు కూడా కోరుకుంటున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. ‘నక్సలిజంపై పోరులో ప్రజలు కూడా మాకు అండగా నిలిచారు. వేలమంది సైనిక బలగాలు, పోలీసులను నక్సల్స్ చంపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారు.. హింస కాదు. బస్తర్ యువకులను కలిశా.. వాళ్లందరూ నక్సలిజాన్ని వ్యతిరేకించారు. ప్ర స్తుత సమాజంలో నక్సలిజానికి తావు లేదు. ఎన్డీఏ పాలనలో మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతోంది. నక్సలైట్ల ఎజెండాలో అభివృద్ధి అన్నది లేదు. నక్సలైట్లు తమ ఉనికి కోసమే పోరాడుతున్నారు. భగత్ సింగ్, బిర్సాముండాలతో నక్సలైట్లను పోల్చకూడదు. ‘రోడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలు లేకుండా గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి. నక్సల్స్ చిన్న పిల్లలకు తుపాకులు, ఆయుధ సామగ్రి ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల యువత జీవితాలను నక్సల్స్ నాశనం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. విద్య, వైద్య, మౌలిక వసతులను కూ డా నక్సల్స్ ధ్వంసం చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం.. రాజ్యాంగాన్ని స్వీకరించాం. ఆయుధాలు చేపట్టి ప్రజల ప్రాణాలు తీయాలని ఏ సిద్ధాంతాలు చెప్పాయి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని నక్సల్స్ గ్రహించాలి. స్కూళ్లు, బ్యాంకులు, హా స్పిటల్లు తగలబెట్టేవారి వల్ల అభివృద్ధి ఎలా సాధ్యం? ఆయుధాలు చేతుల్లోకి తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కాంగ్రెస్ పాలిత రాష్టాల్ర నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది. ఇందిరా గాంధీ వల్లే మావోయిస్టు పార్టీ అన్ని ప్రాంతాలకు విస్తరించిందని అమిత్ షా ధ్వజమెత్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *