పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

– మంత్రి సీతక్క హామీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ కాలం గణన, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానం రద్దు చేసి ఓపీఎస్‌లను జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి సీతక్కకు విన్నవించుకున్నారు. తెలంగాణ పంచాయత్‌ సెక్రటరీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు, కార్యదర్శులు ప్రజాభవన్‌లో శనివారం ఆమెతో సమావేశమయ్యారు. స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికైన 98 మంది అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవడం, టీిఆర్‌ఎస్‌ హయాంలో 16 రోజుల సమ్మె కాలాన్ని సర్వీస్‌ కాలంగా పరిగణించడం, మెడికల్‌ బిల్లుల క్లియరెన్స్‌, స్పౌస్‌, ప‌రస్ప‌ర‌ బదిలీలకు అనుమతి, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పే ఫిక్సేషన్‌ వంటి అంశాలను కూడా వివరించారు. ఈమేరకు ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌ గౌడ్‌, రాష్ట్ర కోశాధికారి ఎం.శశిధర్‌, రాష్ట్ర నాయకులు ఎం.హరికృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శివకుమార్‌, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ సాపాటి పాండు తదితరులు మంత్రి సీతక్కకు వినతిపత్రం సమర్పించారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క ఆయా అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజనను ఆదేశించారు. శాఖ స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలపై వెంటనే ఫైలు సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలన్నింటికీ న్యాయమైన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దశాబ్ద కాలంగా పెండిరగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరిస్తూ సానుకూలంగా స్పందిస్తున్న మంత్రి సీతక్కను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ తమకు రూ.104 కోట్ల బిల్లులు విడుదల చేయించడం, డిప్యూటేషన్‌లకు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *