ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ముందుండాలి

– కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన స‌ర్పంచ్‌ల‌కు స‌న్మానం
– ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం

కరీంనగర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27ః కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా గ్రామ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ పథకాలు అందించ‌డంలో, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ముందుండాలి అని బీసీ సంక్షేమ‌, ర‌వాణా శాఖ‌ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు. క‌రీంన‌గ‌ర్ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్ లో శ‌నివారం సన్మాన కార్యక్రమం జ‌రిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుతో గెలిచిన సర్పంచ్ లకు ముఖ్య‌మంత్రి, పీసీసీ త‌ర‌పున అభినందనలు.. ప్రభుత్వం, పార్టీ మీకు అండగా ఉంటాయి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘాల, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని కోరారు. ముఖ్యమంత్రి గ్రామాలకు నిధులు ఇస్తామని చెప్పారు.. వేసవిలో గ్రామాల్లో తాగునీటి కి ఇబ్బందులు లేకుండా సమీక్ష చేసుకొని సమస్య పరిష్క‌రించాలి అని సూచించారు. గ్రామాల్లో శానిటేషన్ , స్ట్రీట్ లైట్స్, ప్లాంటేషన్, మౌలిక సదుపాయాలు, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల‌న్నారు. స్కూల్ లో విద్యార్థులు, టీచర్లు వస్తున్నారా అని చూసుకోవాల‌ని, మీ గ్రామాలకు ప్రైవేట్ పాఠశాల బస్సులు రాకుండా చూసుకొని ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదివేలా చూడాల‌ని కోరారు. కాగా, కాళేశ్వరం కూలిపోతే ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని పక్కదారి పట్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత‌ల‌ను విమ‌ర్శించారు. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారంటూ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. నెహ్రూ , ఇందిరా గాంధీ ల పేర్లు, వారి చరిష్మా చెరిపేయాలని చూస్తున్నారని ఆరోపించారు. జాతిపిత మహత్మా గాంధీ స్వాతంత్య్రం కోసం పోరాడితే ఆయన ను చంపిన గాడ్సే ను ఆరాధిస్తున్నారు..రేపు ఉపాధి హామీ కార్యక్రమాల దగ్గర గాంధీ చౌరస్తా ల వద్ద గాంధీల ఫొటోలుతో రేపు ప్రతి గ్రామంలో నిరసన తెలపాల‌ని పిలుపునిచ్చారు..జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా పని చేద్దాం.. మీకు అండగా ఉంటాం.. మీ వెంట కాంగ్రెస్ కుటుంబం ఉంది.. మరింత శ్రమించండి అని సూచించారు. ఓడిపోయిన వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేస్తాం.. వారికి కూడా పార్టీ పరంగా అండగా ఉంటామ‌న్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, హుజూరాబాద్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ , మాజీ ఎమ్మెల్యే లు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ , బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , సుడా* చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ ,ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ,ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్, రింకు,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *