ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా

– సంస్థ అభివృద్ధికి సిబ్బంది మరింత కష్టపడాలి
– మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు పూర్తి
– వీసీలో రవాణా శాఖ మంత్రి పొన్నం దిశానిర్దేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: మహాలక్ష్మి పథకం ప్రారంభమై రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో విజన్‌ 2047లో భాగంగా ప్రజా రవాణాను 28 శాతం నుండి 70 శాతానికి పెంచాలని, సంస్థ గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకు సంస్థ మరింత కష్టపడాలని దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని,
వారి పిల్లలకు అధునాతన సౌకర్యాలతో ఆర్టీసీ స్కూల్‌ ఏర్పాటుకు కృషిచేస్తానని తెలిపారు. సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం తమ ప్రధాన లక్ష్యమన్నారు. బుధవారం 65 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించుకున్నామని, మహాలక్ష్మి పథకం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ తరపున మంత్రి పొన్నంప్రభాకర్‌కు సంసథ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్లు అత్యంత విజయవంతంగా మనకుగైడ్‌ చేశారరని, ప్రతి రోజూ 60 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంటే అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉంటారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 251 కోట్ల మహిళా ప్రయాణాలు ఉచితంగా ప్రయాణం చేశారని, రూ.8500 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. 2400 బస్సులు కొత్తగా చేర్చుకున్నాం.. ఈ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తీసుకున్నామని, ఇంటర్‌సిటీ బస్సులు కూడా వస్తున్నాయని, 800 కి పైగా ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయని, జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే రెండేళ్లల్లో మొత్తం 2800 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయని తెలిపారు. ప్రతీ బస్పు ఒక రోజు ఒక టన్ను కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తగ్గిస్తుందని, 81 శాతం బస్సులు మహాలక్ష్మీ స్కీమ్‌ ద్వారా నడిచే బస్సులు ఉన్నాయని నాగిరెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *