– కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసిమెలిసి ఉంటూ నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడని కొనియాడారు. నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడిన సురవరం తెలంగాణకు చెంది సామాన్య కార్యకర్తస్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి గుర్తింపు పొందడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.




