స్మితాసభ‌ర్వాల్‌కు హైకోర్టులో ఊరట

– ఘోష్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశం

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్‌ 25: ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఘోష్‌ కమిషన్‌ నివేదికపై పలువురు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కారు. ఈనేపథ్యంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితాసబర్వాల్‌ హైకోర్టును ఆశ్రయించగా ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్‌ కమిషన్‌ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అమలును నిలిపివేయాలంటూ స్మితా సభర్వాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఘోష్‌ కమిషన్‌ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు.. స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్‌ కమిషన్‌ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అమలును నిలిపివేయాలంటూ స్మితా సభర్వాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. స్మితా సభర్వాల్‌ గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తనను సాక్షిగా పిలిచిందని, అయితే తనపై ఆరోపణలు చేసే ముందు చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. విచారణ కమిషన్‌ చట్టం-1952లోని 8బీ, 8సీ సెక్షన్ల ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న నిబంధనలను కమిషన్‌ అమలు చేయలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు లోబడి ఉన్నదని తెలిపారు. క్యాబినెట్‌ ఎదుట ఫైళ్లు ఉంచలేదు కాబట్టి చర్యలు తీసుకోవాలని కమిషన్‌ పేరొనడం చెల్లదని తెలిపారు. కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. తుది ఉత్తర్వులు వెలువరించే వరకు నివేదిక అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *