పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదికను కొట్టేయండి

-హైకోర్టులో సవాల్‌ ‌చేసిన ఐఏఎస్‌ ‌స్మితా సబ‌ర్వాల్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:  ‌సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబ‌ర్వాల్‌ ‌తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ఇచ్చిన నివేదికను హైకోర్టులో ఆమె సవాల్‌ ‌చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ ‌చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పిటిషన్‌ ‌రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా  పరిశీలన పూర్తయి లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఇటీ-వల ఊరట లభించింది. కమిషన్‌ ‌నివేదిక సిఫారసుల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు, ఈ నివేదికను సవాల్‌ ‌చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను కేసీఆర్‌, ‌హరీశ్‌రావుల పిటిషన్‌తోపాటు అక్టోబరు 7కి హైకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సబ‌ర్వాల్‌ ‌సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *