– 700 కుటుంబాలకు నోటీసులిచ్చిన అధికారులు
– కచ్చితమైన గడువు, పునరావాసంపై స్పష్టతా లేవు
~ స్థానికుల్లో ఆందోళనలు
న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నూతన నివాస నిర్మాణ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికివాడల్లో నివాసముంటున్న కుటుంబాలపై పడింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆ కుటుంబాలను ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు పంపింది. అక్కడినుంచి ఖాళీ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దాదాపు 700 కుటుంబాలకు ఈ నోటీసులు అందాయని తెలుస్తున్నది. అయితే కచ్చితమైన గడువు తేదీని పేర్కొనకపోవడం, పునరావాసంపై ఎలాంటి స్పష్టతా లేకపోవడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాని నూతన నివాసం నిర్మాణం నేపథ్యంలో భద్రతా కారణాల దష్ట్యా ఈ నోటీసులు వచ్చినట్టు భావిస్తున్నారు. రేస్‌కోర్స్ రోడ్ వెంట ఉన్న భాయిరామ్ క్యాంప్, మస్జీద్ క్యాంప్, డిఐడి క్యాంప్ నివాసితులకు ఈ నోటీసులు అందినట్టు సమాచారం. నోటీసులో ఆ భూమిని ప్రభుత్వానికి చెందినదనీ, ఇకపై అక్కడ నివసించడం అనధికారికంగా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆదేశాలను పాటించకపోతే చట్ట ప్రకారం తొలగింపు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. చాలామంది నిరుపేదలు అక్కడ నివసిస్తూ సవిÖప ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. కాగా, వారు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదించి పునరావాసంపై స్పష్టత కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


