– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రతిష్ఠాత్మక ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్‌లెట్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఇన్‌లెట్ పనులు కుడా ప్రారంభమయ్యాయని, తవ్వకాలు వేగవంతం అయ్యాయని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేÉడ్కర్ సచివాలయంలో ఎస్‌ఎల్‌బీసీతోపాటు, డిండి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ పురోగతిపై ఆయన శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ రెండు వైపులా తవ్వకాలు ప్రారంభమైనందున ఇకపై నిరంతరాయంగా పనులు కొనసాగుతాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాంగా· నిలవనున్న ఈ ప్రాజెక్టు తవ్వకాలలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు నిబంధనలు కఠినంగా పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. తవ్వకాల సమయంలో సొరంగ మార్గం చివరికంటూ గాలి, వెలుతురు ప్రసారమయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇన్‌లెట్ వైపు పనులు పునఃప్రారంభం కావడానికి ముందే 20 మీటర్ల దూరం ఓపెన్ కట్ చేయడంతోపాటు అదనపు భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే ప్రారంభించిన ఔట్‌లెట్ తవ్వకాలలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి 20 మీటర్ల దూరం పూర్తి చేశామని తెలిపారు. ఏడేళ్లుగా ఔట్‌లెట్ పనులు నిలిచిపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ 43.93 కి.మీ పొడవైన ఎసఎల్‌బిసి సొరంగ మార్గం శ్రీశైలం ఎడమ కాలవ భాగం నుండి మొదలుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది పూర్తి అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా ఇది నిలిచిపోతుందన్నారు. అయితే 2025 ఫిబ్రవరిలో దురదృష్టవశాత్తు జరిగిన ఘటనతో పనులు నిలిచిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి పనుల పునరుద్ధరణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించి దాని సిఫార్సుల మేరకు పునరుద్ధరణ పనులు ప్రారంభించామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





