ఎస్‌ఎల్‌బిసి పనులకు కార్యాచరణ ప్రణాళిక

– ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
– నిపుణుల సూచనల మేరకే పునరుద్ధరణ పనులు
– నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌ 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్‌.ఎల్‌.బి.సి ప్రాజెక్ట్‌ పనుల పునరుద్ధరణకు ప్రణాళికా బద్దంగా కార్యాచరణకు పూనుకున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. శుక్రవారం డాక్టర్‌ బి.ఆర్‌.అంబెడ్కర్‌ సచివాల యంలో జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌.ఎల్‌.బి.సి పనులను పునఃప్రారంభించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొంచినట్లు ఆయన తెలిపారు. అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవ డంతో పాటు పాలనా పరమైన అనుమతులు పొందేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. దురదృష్టవ శాత్తు జరిగిన ఎస్‌.ఎల్‌.బి.సి టన్నెల్‌ ప్రమాదం అనంతరం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను,సూచనలను అనుసరించి పునరుద్ధరణ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం దిగువ భాగం నుంచి వచ్చే వరద కాలువ మిగిలిన 9 కిలోమీటర్ల టన్నెల్‌ తవ్వకానికి ఆటంకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రతి సంవత్సరం ఆ నీటిని ఎత్తిపోసేందుకే ప్రతీ సంవత్సరం రూ.750 కోట్లు కేవలము విద్యుత్‌ చార్జీలను చెల్లించాల్సి వస్తుందన్నారు. అత్యంత వెనుక బడిన ప్రాంతాలకు సాగు నీరు,ఫ్లోరోసిస్‌ రహిత సాగు నీటిని అందించేందుకుద్దేశించబడిన ఈ ప్రాజెక్ట్‌ మరో తొమ్మిది కిలోమీ టర్లు సొరంగ మార్గం పూర్తి అయ్యే సమయంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆధునిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. అందులో భాగంగా నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ ఐ) ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ ద్వారా ఎలక్ట్రోమేగ్నటిక్‌ సర్వే నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు. పర్వత భూభాగంలో ఉన్నందున హెలికాప్టర్‌ సర్వే తప్పని సరైందన్నారు.ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల ప్రారంభానికి ఈ సర్వే దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అంతే గాకుండా జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)ని కుడా ఈ పనుల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు.పునరుద్ధరణ పనులు ప్రణాళికా బద్దంగా నిర్వహించేందుకు లిడార్‌ సర్వే ను కుడా నిర్వహించ బోతునట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన అంచనా వ్యయాన్ని మించనీయకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మూడు దశాబ్దాల సుదీర్గ విరామం అనంతరం నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశామన్నారు. అదీ కుడా పారదర్శకంగా నిర్వహించామని, ఏయియిల నుండి సిఇల వరకు 47 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్ల నుండి డిప్యూటీ ఇంజినీర్ల వరకు 127 మంది,ఎస్‌.ఇ ల నుండి సి.ఇ ల వరకు 13 మంది ఉన్నారన్నారు. అన్నీ విభాగాల సిబ్బంది కి 33 సంవత్సరాల తరువాత స్కెల్‌ తో పాటు పదోన్నతులను క్రమబద్దీ కరించామన్నారు. ఇందుకు ప్రతిభ,సీనియారిటీ లను ప్రాతిపదికను తీసుకున్నామన్నారు.ఇక నుండి నీటిపారుదల శాఖా సిబ్బంది తమ తమ బాధ్యతలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆయన ఉద్బోధించారు.పెండిరగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే పనులలో నిమగ్నం కావాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. సింగూర్‌ డ్యామ్‌ ను పరిశీలించి అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే సహించేది లేదన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యామ్‌ లు,రిజర్వాయర్‌ లతో పాటు ఇతర జలాశయాలను నిత్యం పర్యవేకక్షించాలని ఆయన సూచించారు. ప్రమాదం అని భావించి ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్‌ తో పాటు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌ తో ఛత్తీస్‌ ఘడ్‌ పై చూపే ప్రభావాల పై ఐ ఐ టి ఖరగ్‌ పూర్‌ జరిపిన అధ్యయనం నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగరం మండలంలోని తుపాకులగూడెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్‌ నిర్మాణం తెలంగాణా ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి బ్యారేజ్‌ నిర్మాణంతో ఛత్తీస్‌ ఘడ్‌ లో సుమారు 40 హెక్టార్లు ముంపునకు గురవుతుందని ఐ ఐ టి ఖరగ్‌ పూర్‌ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. దీని ప్రభావం ఛత్తీస్‌ ఘడ్‌ లోని కోటూర్‌,తార్లగూడ,గంగారాం,కంబల్పేటలతో 10.9 చ.కి.మీ భూబాగం ముంపుకు గురౌతుందని అధ్యయనంలో తేలిందన్నారు. అయితే అదే సమయంలో ఈ బ్యారేజ్‌ ని పూర్తి చే సేందుకు గాను ఛత్తీస్‌ ఘడ్‌ తో సంప్రదించి అవసరమైన అనుమతులు తీసుకుంటా మన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 6.94 టి.యం.సి ల నీటితో 16.40 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.2017 లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం 2022 లో పూర్తి కావల్సి ఉండగా వివిధ కారణాలతో పనులలో జాప్యం జరిగిందన్నారు.ఛత్తీస్‌ ఘడ్‌ తో సంప్రదింపులు జరిపి త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. నీటిపారుదల రాష్ట్ర సలహాదారుడు ఆదిత్యనాథ్‌ దాస్‌,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌,ఇ.ఎన్‌.సి లు అంజద్‌ హుస్సేన్‌, రమేష్‌ బాబు,ఆర్‌ అండ్‌ర్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు,సి.ఇ అజయ్‌ కుమార్‌ తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *