అభివృద్ధి వ్యూహంగా మారిన నైపుణ్యాభివ ద్ధి

– మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నైపుణ్యాభివృద్ధి ఒక శాఖ మాత్రమే కాదు.. అభివృద్ధి వ్యూహంగా మారిందని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి.పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ స్కిల్ సెంటర్లుగా మారుస్తున్నామని, ఆధునిక యంత్రాలు, డిజిటల్ పరికరాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికలను అమలు చేస్తున్నామని వివరించారు. కన్హా శాంతి వనంలో మంగళవారం నిర్వహించిన ఇండియా స్కిల్స్ కాంపిటిషన్ 2025-26 దక్షిణ ప్రాంత పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ క్రాంతి వెస్లీ కూడా పాల్గొన్నారు. సౌత్ ఇండియా స్థాయి పోటీలలో మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో 350కిపైగా పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా 123 మంది యువతులు పాల్గొనడం ప్రోత్సాహకరంగా నిలిచింది.

సంప్రదాయంగా పురుషాధిక్యంగా భావించే కేబినెట్ మేకింగ్, కార్పెంట్రీ, ఎలక్ట్రికల్ ఇన్‌స్టలేషన్స్, ప్లంబింగ్, హీటింగ్ వంటి రంగాల్లో 20మంది మహిళలు పోటీ చేయడం సామాజిక మార్పుకు నిదర్శనంగా నిలిచింది. 3డి డిజిటల్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోనమస్ మొబైల్ రోబోటిక్, బ్యూటీ థెరపీ, బ్రిక్ లేయింగ్, కేబినెట్ మేకింగ్, కార్పెంట్రీ తదితర విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు మంత్రి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను ప్రదానం చేశారు. ఈ రోజు కేవలం సర్టిఫికెట్ల గురించినది కాదు.. ఇది కృషి, క్రమశిక్షణ, అంకితభావం, ప్రతిభను గౌరవించే రోజు.. ఇక్కడ ఉన్న యువతను చూసినప్పుడు దేశ భవిష్యత్తుపై అపారమైన విశ్వాసం కలుగుతోంది అని మంత్రి అన్నారు. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) వారధిగా కీలక పాత్ర పోషిస్తోందని, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కరణ సామర్థ్యం, డిజిటల్ లిటరసీ వంటి అంశాలను శిక్షణలో భాగం చేశామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేంద్రంగా ఎదిగిందని, అందుకే ఏఐ, రోబోటిక్స్, మెచాట్రానిక్స్, డేటా అనలిటిక్స్, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ‘నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదు, సాధికారత కోసం కూడా. ఒక యువకుడు లేదా యువతి నైపుణ్యం నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. గౌరవం వస్తుంది.. స్వతంత్రత సాధ్యమవుతుంది.. నైపుణ్యం ఉన్న వారు అవకాశాల కోసం ఎదురుచూడరు.. వారు అవకాశాలను సృష్టిస్తారు అని మంత్రి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *