ఆరు గ్యారెంటీల అట‌కెక్కించారు

– అంకెల ఆరాటం తప్ప మరేం లేదు
– గత బడ్జెట్ పథకాలే అమలు చేయలేదు
– హైదరాబాద్ను మూడు ముక్కలు చేస్తున్నారు
– ఇంతకు మించి ఒరగబెట్టిందేం లేదు
– చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది
– రాష్ట్రంలో తలసరి ఆదాయం తగ్గింది
– ఆర్టీసీలో పింఛను బకాయిల ఊసే లేదు
– మూడు పంటలకు రైతుబంధు ఇవ్వలేదు
– ప్రభుత్వంపై విరుచుకుపడ్డ హరీష్ రావు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20: తెలంగాణ బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు పెదవి విరిచారు. ఇదొక ఝూటా బ్జడెట్‌.. బోగస్‌ ‌బడ్జెట్‌ అని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను, ఆర్టీసీ కార్మికుల సమస్యలను, నిరుద్యోగల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పించన్‌ ‌పెంపు హాలను కూడా సర్కారు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్‌ ఎం‌దుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇందులో సకలజనుల దక్కింది గుండు సున్నా తప్ప ఏ లేదని హరీష్‌రావు విమర్శించారు. అంకెలగారడీ, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి పేదలపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం ఈ బడ్జెట్‌ ‌ద్వారా అర్థమవుతోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు అభయహస్తమని హా ఇచ్చారని, ఇప్పుడు మూడో బడ్జెట్‌లో కూడా రిక్తహస్తమే మిగిల్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లు కాలేదుగానీ మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని, తెచ్చిన ఆ అప్పుతో ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడితే.. కాంగ్రెస్‌ ‌తన రెండున్నరేళ్ల పాలనలో వెనుకపడేసిందని హరీష్‌రావు విమర్శించారు. బడ్జెట్‌ ‌ప్రసంగం సందర్భంగా భట్టి అంబేద్కర్‌ ‌సూక్తులు, రాజ్యాంగ విలువలను వ్లలెవేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనుక కూసోబెట్టుకుని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గోరీ కట్టారని దెప్పిపొడిచారు. ఈ బ్జడెట్‌ను చూస్తే ఎన్నికల హాలపై కాంగ్రెస్‌ ‌సర్కార్‌కు చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమైందని అన్నారు.  గతం కంటే 20పేజీలు పెంచారు తప్ప.. హాలకు కేటాయింపులు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారని ధ్వజమెత్తారు. సీఎం ప్రజలకే కాదని.. ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో ఉండటం లేదని హరీష్‌ ‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో 3లక్షల పింఛన్లు కట్‌ ‌చేసి.. 2లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారని అన్నారు. కోటీశ్వరులు సంగతి అటుంచి.. మొదట మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. రాజీవ్‌, ఇం‌దిరమ్మ పేర్లతో అమలవుతోన్న స్కీంలకు సైతం కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ది.. అభయ హస్తం కాదని.. రిక్త హస్తమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానిది మూడు ముక్కలాట తప్ప.. విజన్‌ ‌లేదని దెప్పిపొడిచారు. బ్జడెట్‌లో అన్నివర్గాలకు మొండి చెయ్యి చూపారని ఆగ్రహించారు. మూడున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చి.. రేవంత్‌ ‌చేసిందే లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో సచివాలయం, కాళేశ్వరం, చెక్‌ ‌డ్యాంలు కట్టామని ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెనుక కూర్చోపెట్టుకుని భట్టి.. రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో స్కాంలు తప్ప.. స్కీంలు లేవని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మేడారం టెండర్లలో స్కాం జరిగిందని మంత్రి బిడ్డ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడేమో ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూల్స్ అం‌టున్నారని దెప్పిపొడిచారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వానివి కట్టుకథలని విమర్శించారు. అక్రమ సంపాదన దాచుకోవటానికే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. మూడుసార్లు రైతుబంధు ఎగొట్టినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. పాలన గాడి తప్పటం వలనే తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి మాముళ్లు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రిని మూసేస్తామంటే.. భట్టి ఏమో యాదాద్రి తెలంగాణకు గర్వకారణమని అంటున్నారని అన్నారు. సింగరేణి గురించి కాంగ్రెస్‌కు మాట్లాడే హక్కు లేదన్నారు. సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని హరీష్‌ ‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెవిలో పూలు పెట్టిన భట్టి బడ్జెట్‌ : ఎమ్మెల్యే గుంటకండ్ల 

బడ్జెట్‌ ‌మొత్తం మోసమని, అన్ని వర్గాల ప్రజల చెవిలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పువ్వులు పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌ ‌మొత్తంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హాలు నెరవేర్చే అంశమే లేదన్నారు. ఆరు గ్యారంటీల ఊసే తీయలేదని మండిపడ్డారు. కేవలం కుంభకోణాల కోసమే కాంగ్రెస్‌ ‌సర్కారోళ్లు ఈ బడ్జెట్‌  ‌పెట్టుకున్నరని ఆరోపించారు. ఈ మేరకు గంగుల కమలాకర్‌, ‌వివేకానందలో కలసి చెవిలో పూలతో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బ్జడెట్‌లో ఎలాంటి అంశం లేదని విమర్శించారు. రైతు భరోసాను ఇచ్చిన మాట ప్రకారం ఈ సారైనా ఎకరానికి రూ.15 వేలకు పెంచుతారని ఆశించామని, కానీ ఊసే తీయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆఖరికి ఆ రూ.12 వేల చొప్పున కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పలేదని ధ్వజమెత్తారు. రైతులకు ఏడాదికి రూ.12 వేల అంశం కూడా ఉత్తమాటగానే మిగిలిపోయిందని విమర్శించారు. ఇక మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డితోసహా కాంగ్రెస్‌ ‌నేతలు జోరుగా ప్రచారం చేశారని, కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఆ హాని నెరవేర్చలేదని జగదీష్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఆడబిడ్డలను దగా చేయడమేనని మండిపడ్డారు. వృద్ద్యాప్య పించన్‌లు, వికలాంగ పించన్‌ల విషయంలో కూడా ప్రభుత్వం మాటతప్పిందని విమర్శించారు. వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులు రూ.6 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *