– మీడియాతో చిటనచాటనలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: అసెంబ్లీ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజన, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మీడియాతో చిట్‌చాట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై చర్చ అంటే బీఆర్‌ఎస్ కు భయం ఎందుకు అని ప్రశ్నించారు. కోర్టులో ఏం తేలకపోవడంతో యూరియా అంశాన్ని బీఆర్‌ఎస్ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగకుండా ఉండేందుకే శతవిధాల ప్రయత్నిస్తూ యూరియా పేరుతో బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





