కవిత ఎపిసోడ్‌ కుటుంబ డ్రామా

– మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్‌ కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. సయివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ సంతోష్‌ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించింది.. అదే పోచంపల్లి ములుగులో తనను ఓడిరచేందుకు ప్రయత్నించాడన్నారు. కవిత ఆరోపించిన బినామీ ఆస్తులపై బీఆర్‌ఎస్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్‌ ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్‌ చేయడం సాధ్యమా అన్నారు. కేటీఆర్‌ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామా అని, మొదట కేటీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత ఇప్పుడు హరీష్‌ రావు, సంతోష్‌రావులను టార్గెట్‌ చేశారని అన్నారు. కవిత సస్పెన్షన్‌ ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. సొంత ఆడబిడ్డను పార్టీ మహిళా నాయకులతో విమర్శింపచేస్తున్నారు.. వీళ్లే గతంలో మమ్మల్నీ విమర్శించారు అని సీతక్క అన్నారు. గతంలో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డిని కవిత విమర్శిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ కేసీఆర్‌ కుటుంబంపై అవినీతి మచ్చ బయటపడగానే హరీష్‌ రావు, సంతోష్‌ రావులపై ఆరోపణలు చేసినందుకు సస్పెండ్‌ చేశారన్నారు. రేవంత్‌ రెడ్డి డైరెక్షన్‌లో హరీష్‌రావు పనిచేస్తున్నారని కవిత మాట్లాడటం రాజకీయ ఆజ్ఞానానికి నిదర్శనమని ఆమె అన్నారు. 2018లో కొడంగల్‌ ఇన్‌చార్జిగా ఉన్న రేవంత్‌ను వోడగొట్టేందుకు హరీష్‌ రావు వందల కోట్లు ఖర్చు చేశారని, నిజంగా హరీష్‌ను రేవంత్‌ కాపాడాలనుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు విచారణ చేయిస్తారని నిలదీశారు. కవిత దిష్టిబొమ్మను దహనం చేయడం దురదృష్టకరమని, తండ్రి కాని, అన్న కాని ఆమె దిష్టిబొమ్మ దహనాన్ని ఆపలేకపోయారని సీతక్క వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *