ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్‌’ నోటీసులు
– రేపు మధ్యాహ్నం విచారణ చేపడతామని వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ‘సిట్‌’ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి గురువారం వెళ్లి అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వయసు దృష్ట్యా పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని ‘సిట్‌’ పేర్కొంది. ఈ కేసులో ఇటీవల మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు మాజీ ఎంపీ సంతోష్‌రావును విచారించిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్‌నూ విచారించాలని ‘సిట్‌’ నిర్ణయించింది. రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘సిట్‌’ను పూర్తిగా ప్రక్షాళన చేసి సీపీ సజ్జనార్ నేతృత్వంలో మార్పులు చేర్పులు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన పోలీస్ అధికారులను విచారించి వారిని రిమాండ్‌కు తరలించారు. ఆ తరువాత ట్యాపింగ్‌లో బాధ్యులుగా ఉన్నవారిని విచారించి వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాగా, కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *