Sisterly love: సోదరీమణుల ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే

~ హరీష్‌రావుకు రాఖీ కట్టిన మాజీ మంత్రి సత్యవతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌ రావు (ex-minister Harish Rao) నివాసంలో సందడి నెలకొంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌(ex-minister Satyavati Rathod) , మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అక్కాచెల్లెమ్మలు ఆత్మీయంగా రాఖీ కట్టారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ సోదరీమణుల ప్రేమ, ఆప్యాయత తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని అన్నారు. తెలంగాణలో ప్రతి సోదరి సుఖసంతోషాలతో ఉండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. రాఖీ కట్టిన సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *