- నిందితులపై పలు జిల్లాల్లో కేసులు
- 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి అభరణాలు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ నాగేశ్వరరావు
Sircilla theft case | సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఏప్రిల్ 02: పలు జిల్లాల్లో చోరీల కు పాల్పడిన ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈసందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరుస చోరీలకు పాల్పడిన నిందితులు మహ్మద్ అజ్గర్ పాషా, పిట్టల అరవింద్, సామల బాలకిషన్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మార్చి 30న తంగళ్ళపల్లి మండలం తాడూరి గ్రామానికి చెందిన సాసాల లక్ష్మి తన ఇంటికి తాళం వేసి తన కూతురు వద్దకు వెళ్లగా తెల్లవారుజామున దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 2 తులాల బంగారు, 11 తులాల వెండి ఆభరణాలు, 3వేల నగదును ఎత్తుకెళ్లారు. దీంతో లక్ష్మి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా ఎస్.ఐ ఉపేంద్రాచారి కేసు నమోదు చేసి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టి నిందుతులను పట్టుకున్నారన్నారు.
చందుర్తి మండలం జోగపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్గర్ పాషా, చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన పిట్టల రవీందర్, వేములవాడ మండలం సుభాష్ నగర్ కి చెందిన సామల బాలకిషన్ గుర్తించి మండపల్లి గ్రామ శివారులో పట్టుకొని విచారించగా వారి వద్ద దొంగిలించి 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి అభరణాలను స్వాధీన పర్చుకొని గురువారం రిమాండ్ కి తరలించామన్నారు. మహమ్మద్ అజ్గర్ పాషా సిరిసిల్ల జిల్లలో 21 దొంగతనం కేసు, పిట్ల అరవింద్ కరీంనగర్, జగిత్యాల,సిరిసిల్ల 08 దొంగతనం కేసు, బాలకిషన్ పై సిరిసిల్ల, సిద్దిపేట ,జిల్లాలో 06 దొంగతనం కేసులలో నిందితులుగా కేసులు నమోదైనట్లు సిఐ తెలిపారు.





