త్వరలో తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐర్

– సిద్ధ‌మవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం

న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హత లేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సిన్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను సీఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ‘సర్’ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. మన రాష్ట్రం సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసారి ‘సర్’ చేపడతారు. ఇప్పటికే కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త ‘సర్’ మొదలవుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, బీహార్ లో కొనసాగుతోంది. బీహార్ లో ముగింపు దశకు చేరుకుంది. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్‌, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒరికా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ‌, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర. కర్ణాటక, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, చండీగర్, వాద్రా అండ్ నగర్ హవేలి, దామన్ అండ్ డయులో ఏప్రిల్ నుంచి ‘సర్’ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. ఆ ఇంట్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వంటి ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లు లేని ఓట్లను తొలగిస్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *