– జనగణమన కంటే ముందే పాడాలి
– ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
న్యూదిల్లీ, ఫిబ్రవరి 11: అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇకనుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనను బుధవారం నుంచి అమలులోకి తెచ్చింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాÅ£ అన్ని పౌరపురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని తెలిపింది. అయితే సినిమా హాళ్లలో దీనిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని నిబంధనల్లో పేర్కొంది. జాతీయ గీతం, గేయం పాడుతుండగా అంతరాయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వచ్చాయి. అందులో ఆరు చరణాలను పాడాలని, 3 నిమిషాల 10 సెకన్లలో ఆలపించాలని కేంద్రం పేర్కొంది. స్వాతంత్య్ర పోరాట సమయంలో ముస్లింలీగ్ అభ్యంతరాల మేరకు ఆరు భాగాల్లోంచి మతపరమైన ప్రస్తావన లేని తొలి రెండింటిని మాత్రమే కాంగ్రెస్ స్వీకరించింది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం వివాదం లేని తొలి రెండు భాగాలతో వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





