హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: సింగరేణికి కొత్త సీఎండీ (ఎఫ్ఏసీ)గా దేవరకొండ కృష్ణ భాస్కర్ మంగళవారం సాయంత్రం సింగరేణి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బలరామ్ నుంచి కృష్ణ భాస్కర్ బాధ్యతలను స్వీకరించారు. నూతన సీఎండీకి సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు స్వాగతం పలికారు. కృష్ణ భాస్కర్ 2012 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వహించారు. పరిశ్రమల శాఖకు డైరెక్టర్ గా, రాష్ట్ర ఆర్థిక -ప్రణాళిక శాఖకు స్పెషల్ సెక్రటరీగా వ్యవహరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



