సింగరేణి సీఎండీగా బుద్ధప్రకాష్ బాధ్యతల స్వీకరణ‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2002 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన బుద్ధప్రకాష్ గతంలో షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. రవాణా, భూమి రికార్డులు, సామాజిక సంక్షేమంలో విస్తృత అనుభవం ఆయనకు ఉంది. రిజిస్టేష్రన్ అండ్ స్టాంపుల కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్, సర్వే సెటిల్‌మెంట్లు అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *