రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఘనం

కాంగ్రెస ప్రభుత్వం, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం
కార్పొరేటన కంపెనీలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం
సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటనలో సీఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22: రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను తమ పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందన్నారు. సచివాలయంలో సింగరేణి కార్మికులకు 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన లాభాలలో వాటా ప్రకటన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని, అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కార్పొరేట్‌ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని చెప్పారు. సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లు ఇందులో రూ.4034 కోట్లు భవిష్యత్‌ పెట్టుబడులకు కేటాయించామని, రూ.2360 కోట్లు నికర లాభాలు రాగా అందులో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్‌ కార్మికులకు బోనస్‌ కోసం కేటాయించామని వివరించారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5000 బోనస్‌ అందించామని, రూ.5500 బోనస్‌ అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని, ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందంటూ ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో కార్మికులకు అండగా ఉంటామని, సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని, కార్మికులకు దీపావళికి కూడా బోనస్‌ ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్ల ఆదాయం తగ్గిందని, తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, హర్కర వేణుగోపాల్‌, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్‌, సింగరేణి సీఎండీ బలరాం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *