సింగరేణికి కొత్త బ్లాక్‌లు దక్కడంలేదు

– ఇతర ఖనిజాల తవ్వకంలోనూ పాల్గొనాలి
– ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం
– మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఖనిజాల తవ్వకాల్లోనూ పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సింగరేణి కార్మిక సంఘాలతో ఆయన శుక్రవారం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు గనులు తగ్గుతున్నాయని, తద్వారా సంస్థకు నష్టం వాటిల్లుతోందని అన్నారు. రాయచూరు, దేవదుర్గ ప్రాంతాల్లో కాపర్‌ అండ్‌ గోల్డ్‌ మైనింగ్‌ ఆక్షన్‌లో సింగరేణి పాల్గొందని గుర్తు చేశారు. దీనివల్ల సింగరేణి 37.7 శాతం వాటాను దక్కించుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే సత్తుపల్లి, కోయగూడెం బ్లాక్‌లు ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్లాయని, సింగరేణిని పది కాలాలపాటు కాపాడుకునేందుకు ఏం చేయాలో కార్మిక సంఘాలు ఆలోచించాలని భట్టి విక్రమార్క సూచించారు. కొత్త బ్లాకులు రాకపోష్ట్ర్వడంతో సంస్థతోపాటు రాష్ట్రానికి నష్టం అని హెచ్చరించారు. సింగరేణి సంస్థలో పనిచేసే వారు సంస్థ గురించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం జరుగుతుందన్నారు. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడ తక్కువ ధరకు బొగ్గు లభిస్తే అక్కడ కొనుక్కునే అవకాశం ఏర్పడిరదని, ఈ నేపథ్యంలో సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు అమ్మకం కాకపోతే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని సంఘాలు సమావేశమై సింగరేణి భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని అమలు చేసేందుకు, సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి.. సంస్థను బతికించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలు అన్వేషించాలని కార్మిక సంఘాలకు సూచించారు. కార్మిక సంఘాలు అవగాహన లేకుండా హిస్టారికను మాట్లాడితే సంస్థకు నష్టం జరుగుతుందన్నారు. మారిన ఆర్థిక పరిస్థితులు, ఓపెన్‌ మార్కెట్‌లో బొగ్గు కొనుగోలు చేసే పరిస్థితి పోటీలో నిలబడాలంటే ఏం చేయాలి అనే విషయాలను సింగరేణి అధికారులు కార్మికులకు భోజనం పెట్టి వివరించాలని, సగం రోజు సెలవు ఇచ్చి మరీ విషయాలను వివరించాలని సింగరేణి అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. సమావేశంలో మినిమం వేజ్‌ బోర్డు చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, కార్మిక సంఘం నాయకులు ధర్మపురి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.న లేకుండా హిస్టారికను మాట్లాడితే సంస్థకు నష్టం జరుగుతుందన్నారు. మారిన ఆర్థిక పరిస్థితులు, ఓపెన్‌ మార్కెట్‌లో బొగ్గు కొనుగోలు చేసే పరిస్థితి పోటీలో నిలబడాలంటే ఏం చేయాలి అనే విషయాలను సింగరేణి అధికారులు కార్మికులకు భోజనం పెట్టి వివరించాలని, సగం రోజు సెలవు ఇచ్చి మరీ విషయాలను వివరించాలని సింగరేణి అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. సమావేశంలో మినిమం వేజ్‌ బోర్డు చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, కార్మిక సంఘం నాయకులు ధర్మపురి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *