భారత్‌కు క్షేమంగా చేరుకున్న సింధు

– బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన స్టార్ షట్లర్

బెంగళూరు, మార్చి 3 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఆమె మంగళవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. మంగళవారం నుంచి జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం గత వారం ఇంగ్లాండ్ బయల్దేరిన సింధు అమెరికా`ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈమేరకు సింధు ’ఎక్స’లో ఒక పోస్టు పెట్టారు. సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నా. గత కొద్ది రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎట్టకేలకు ఇంటికి చేరుకోగలిగా. ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని సురక్షితంగా చూసుకునేందుకు దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులు అందించిన సేవలను మాటల్లో చెప్పలేను. వారందరికీ హదయపూర్వక కతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. తేరుకున్నాక భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్తా అని సింధు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో గత శనివారం నుంచి విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె ప్రయాణం ఆగిపోయింది. అప్పటినుంచి దుబాయ్‌లోనే సురక్షిత ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే యూఏఈ, భారత్ అధికారుల సమన్వయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో సింధు బెంగళూరుకు చేరుకున్నారు. ప్రస్తుత పరిణామాల్ని నిశితంగా గమనిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యూఎఫఐ) ప్రయాణ ఆటంకాల కారణంగా క్రీడాకారులు ఆలస్యంగా వస్తే షెడ్యూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనేదీ రాలేదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *