సిక్కు మారణ హోమం చరిత్రలో విషాద ఘట్టం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 1984 సిక్కు మారణహోమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 సిక్కు మారణ హోమం భారత చరిత్రలో ఒక విషాద ఘట్టం అని పేర్కొన్నారు. ఆ అమాయక ప్రజల త్యాగం, ధైర్యం దేశాన్ని మేల్కొలిపిన శక్తిగా నిలిచిందని, ఆ సంఘటన మన సమాజానికి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలనే పాఠం నేర్పిందని అన్నారు. న్యాయం, సమానత్వం, ఐక్యత అనే విలువలను బలపర్చే దిశగా సమాజం ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్‌ మోహన్‌ సింగ్‌, మైనారిటీ మోర్చా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *