యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు

– ‘డేర్‌ టు డ్రీమ్‌’ శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: యువతలో అపారమైన శక్తిసామర్థ్యాలున్నాయని, వారిని మనం ప్రోత్సహిస్తే అద్భుతాలు
సృష్టించగలరని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ సిఖ్‌ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ జిల్లా తూంకుంటలోని ఓ రిసార్ట్‌లో డేర్‌ టు డ్రీమ్‌ పేరిట సిఖ్‌ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఆలోచనలకు, ఆకాంక్షలకు పరిమితులు పెట్టుకోవద్దని యువతకు దిశా నిర్దేశం చేశారు. కలలు కనడం ఎంత ముఖ్యమో వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడటం కూడా అంతే ముఖ్యమన్నారు. గెలుపోటముల గురించి ఆలోచించొద్దని, లక్ష్యాన్ని చేరుకునే వరకూ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాలని సూచించారు. కృషి, పట్టుదల లేకుండా ఏ కల సాకారం కాదన్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సిఖ్‌ సొసైటీ ప్రతినిధులు తేజ్‌దీప్‌ కౌర్‌, గగన్‌ కోహ్లీ, సురేందర్‌ సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *