– ప్రొఫెసర్ కోదండరాం
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పరిహారం వెంటనే బాధిత కుటుంబాలకు చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్ లో సిగాచి పేలుడు బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక ప్రమాదాలు, యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ సంస్థల వైఫల్యం అనే అంశాలపై సమావేశం కొనసాగింది. సిగాచి పేలుడు బాధితులకు ప్రకటించిన పూర్తి పరిహారం ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ సైన్ టిస్ట్ పర్ పీపుల్ (ఎస్ఎఫ్పి), మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్), తెలంగాణా పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిపిజెఎసి) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్ కోదండరాం, సైంటిస్ట్ బాబురావు, న్యాయవాది వసుధ నాగరాజు, టిపిజేఏసీ కన్వీనర్ వై.అశోక్ కుమార్, జాతీయ కన్వీనర్ ఎంవిఎఫ్ ఆర్.వెంకట్ రెడ్డి, ఏపీసిఆర్ డాక్టర్ ఉస్మాన్, ఎంఎస్ఐ డైరెక్టర్ బ్రదర్ వర్గీస్, ఎన్ఎపిఎం, వివిధ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిగాచి బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాద సంఘటన బాధాకరం అన్నారు. దేశంలోనే రెండవ అతి పెద్ద ప్రమాద సంఘటన అని తెలిపారు. తక్షణమే బాధ్యత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



