– ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి
– సామూహిక నిర్ణయం కోసం సమయం అవసరం
ఎంఎంసీ జోనల్ కమిటీ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: తాత్కాలికంగా ఆయుధ పోరాటాన్ని విరమించుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ ప్రత్యేక జోనల్ కమిటీ (ఎంఎంసీ) తరఫున అనంత్ పేరుతో సోమవారం లేఖ విడుదలైంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ ఆయుధాలు వదిలేందుకు సిద్ధమని, కానీ 2026 ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వాలని, అప్పటివరకు కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేయాలని మూడు రాష్ట్రాల ముఖ్యమం త్రులను తమ లేఖలో ఎంఎంసీ కోరింది. ఈ నిర్ణయం సామూహికంగా తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని, అందుకే ఈ గడువు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ల పేరిట రాసారు. పార్టీ కేంద్ర కమిటీ మరియు పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన కామ్రేడ్ సోను (మల్లోజుల వేణుగోపాల్) ఇటీవల తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని ‘అనంత్’ తన లేఖలో పేర్కొన్నారు. “పార్టీని కాపాడుకోవడానికి” సాయుధ పోరాటాన్ని ఆపడం ఉత్తమమని సోను గతంలో (సెప్టెంబర్లో) లేఖ రాశారు. ఈ సోను (మల్లోజుల వేణుగోపాల్) అక్టోబర్లో లొంగిపోయిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




