చేర్యాల ప్రజాతంత్ర ఆగష్టు 19 : పట్టణంలోని పెద్ద చెరువులో దూకిన ఓ మహిళ ప్రాణాలను చేర్యాల కానిస్టేబుల్ (Constable ) తాండ్ర స్వామి సూపర్ పోలీస్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట (Siddipet) జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళా కుటుంబ తగదాలతో చనిపోవాలని నిర్ణయించుకొని మంగళవారం ఉదయం చేర్యాల పెద్ద చెరువులోకి దూకింది. ఈ క్రమంలో నడి చెరువులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా అటువైపుగా వాకింగ్ చేస్తూ వెళ్తున్న కానిస్టేబుల్ స్వామి ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి చెరువులోకి దూకి మహిళ ప్రాణాలను కాపాడాడు. మహిళను కాపాడిన కానిస్టేబుల్ స్వామిని పలువురు అభినందించారు.
ప్రాణాలను తెగించి మహిళను కాపాడిన కానిస్టేబుల్



