సిద్దిపేట సీఐపై విచారణకు హైకోర్టు ఆదేశం

 -తప్పు చేస్తే సర్వీస్‌ రికార్డులో నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18 భార్యభర్తల వివాదంలో జోక్యం చేసుకుని, నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్‌ను సిద్దిపేట్‌ టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌ వేధిస్తున్నారనే కేసులో హైకోర్టు స్పందించింది. అభియోగాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీని ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే సీఐ సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించింది. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సీఐ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. తన భార్యతో విబేధాల్లో సీఐ జోక్యం చేసుకుంటున్నారని, కౌన్సెలింగ్‌ రావాలని తనను వేధిస్తున్నాడంటూ భర్త గండ్రాతి సుమన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని శుక్రవారం జస్టిస్‌ తడకమళ్ల వినోద్‌కుమార్‌ విచారణ జరిపి పైవిధంగా ఉత్తర్వులను జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *