జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ క‌న్నుమూత‌

దిల్లీ, ఆగస్టు 4: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖడ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ (81) ఢల్లీిలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. జూన్‌ చివరి వారంలో ఆయన హాస్పిటల్‌లో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స జరుగుతోందని వైద్య వర్గాలు తెలిపాయి. 38 ఏళ్లుగా జేఎంఎంని నడిపిన శిబు సోరెన్‌ జార్ఖండ్‌ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు కేంద్ర మంత్రిగా, రెండుసార్లు జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మరణం జార్ఖండ్‌ రాజకీయాల్లో శూన్యతను సృష్టించిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన హాస్పిటల్‌లో ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. శిబు సోరెన్‌ మరణంపై పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తన తండ్రి మరణ వార్తను హేమంత్‌ సోరెన్‌ సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ ద్వారా తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *