- వంగర ఎస్ఐ జి.దివ్య వినూత్న చొరవ..
- భీమదేవరపల్లి మండలం రత్నగిరిలో తొలి అడుగు
హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : తెలం గాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, బాధితులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఒక విప్లవాత్మక నిర్ణ యం తీసుకుంది. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ‘సిటిజన్ సెంట్రిక్’ విధానానికి శ్రీకారం చుట్టింది.
రత్నగిరిలో బాధితురాలి చెంతకు పోలీసులు
ఈ నూతన విధానంలో భాగంగా, శనివారం (11/04/2026) వంగర ఎస్ఐ జి. దివ్య తన సిబ్బందితో కలిసి భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామాన్ని సందర్శించా రు. ఇటీవల మరణించిన ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి, ఆయన భార్య నుండి నేరుగా ఫిర్యాదును స్వీకరించారు. స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టకుండా, మానవీయ కోణంలో ఆమె నివాసం వద్దే క్రైమ్ నంబర్ 22/2026 యూ /ఎస‌్ 194 బీఎన్ఎస్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పత్రాలను అందజేశారు.
సాధారణంగా ఏదైనా అపశృతి జరిగినప్పుడు బాధితులు మానసిక ఆవేదనలో ఉంటారు. అలాంటి సమయంలో వారు పోలీస్ స్టేషన్‌కు రావడం ఇబ్బందికరంగా మారుతుంది. దీనిని గమనించిన ఉన్నతాధికారులు.. ఫిర్యాదుదా రుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేయా లని ఆదేశించారు. వంగర పోలీసులు ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





